కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ... ఈటల మద్దతుదారులు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య గొడవ
- ఇల్లందకుంటలో చెక్కుల పంపిణీ సభలో రసాభాస
- సభకు జడ్పీ చైర్‌పర్సన్ అధ్యక్షత వహించడం పట్ల అభ్యంతరాలు
- గొడవ పట్ల లబ్ధిదారులు అసంతృప్తి
- సభలో రాజకీయాలు చేయకూడదని, చెక్కులు ఇస్తే చాలంటూ నినాదాలు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో ఈ రోజు ఇల్లందకుంటలో నిర్వహించిన చెక్కుల పంపిణీ సభలో రసాభాస జరిగింది. ఈ ప్రాంత టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రెండు వర్గాలుగా విడిపోయారు.
ఇటీవలే బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మద్దతుగా పలువురు ప్రజాప్రతినిధులు నిలిచి.. సభకు జడ్పీ చైర్‌పర్సన్ అధ్యక్షత వహించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఈటల మద్దతుదారులు, టీఆర్ఎస్ వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
ఈ పరిణామం పట్ల కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో రాజకీయాలు చేయకూడదని, చెక్కులు ఇస్తే చాలంటూ నినాదాలు చేయడం గమనార్హం. చివరకు ఆర్డీవో జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. మొత్తం 189 మంది లబ్ధిదారులకు చెక్కులు పంచారు.