ఎలక్ట్రానిక్ వస్తువులతో వెళుతున్న ట్రక్కు బోల్తా.. సెల్‌ఫోన్లను ఎత్తుకుపోయిన స్థానికులు!
- మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో ఘటన
- రూ.70 లక్షల ఫోన్లు మాయం
- పోలీసుల దర్యాప్తు
- కొన్నింటిని తిరిగి తీసుకున్న పోలీసులు
మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎల్‌ఈడీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో స్థానికులంతా అక్కడికి పరుగున వచ్చి ఆ ఎలక్ట్రానిక్ వస్తువులను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ ట్రక్కులోని రూ.70 లక్షల విలువచేసే సెల్ ఫోన్లను తీసుకుపోయారు. మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులూ మాయమైనట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో షోలాపూర్-ఔరంగాబాద్ హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది కంటైనర్ తలుపును ధ్వంసం చేసి ఎలక్ట్రానిక్ వస్తువులను చోరీ చేయడం గమనార్హం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసిన వస్తువులను పోలీసుల విజ్ఞప్తితో కొందరు తిరిగి అప్పగించారు. చోరీ చేసిన వారంతా వాటిని తిరిగి ఇవ్వాలని పోలీసులు హెచ్చరించారు.