ఈటల రాజేందర్ పై హుజూరాబాద్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
- ఆరుసార్లు గెలిచానని గొప్పలు చెప్పుకుంటున్నారు
- నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిందేమీ లేదు
- ఈటలది ఆత్మగౌరవ పోరాటం కాదు
- ఆయనది అస్తిత్వ పోరాటం
ఇటీవలే బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ నేత, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు. కమలాపూర్ మండలంలోని అంబాలలో తమ పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... హుజూరాబాద్ గడ్డ టీఆర్ఎస్ అడ్డ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ ప్రాంతంలో ఎవరెన్ని ఎత్తులు వేసినప్పటికీ తమ పార్టీని ఏమీ చేయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీలో ఈటల రాజేందర్ చేరడంపై హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈటల రాజేందర్ ఆరుసార్లు గెలిచానని గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే, నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిందేమీ లేదని అన్నారు. స్వార్థప్రయోజనాల కోసమే ఈటల రాజేందర్ పనిచేశారని ఆయన ఆరోపించారు. ఈటలది ఆత్మగౌరవ పోరాటం కాదని, అస్తిత్వ పోరాటమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తే తాము ఊరుకోబోమని చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు.