ఫుట్‌బాల్‌ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా ప్యారాచూట్‌తో మైదానంలో దిగిన నిర‌స‌న‌కారుడు.. వీడియో ఇదిగో

  • యూరోక‌ప్‌లో భాగంగా నిన్న‌ జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్ మ‌ధ్య మ్యాచ్
  • ర‌ష్యా సంస్థ గాజ్‌ప్రోమ్‌కు వ్య‌తిరేకంగా ఓ వ్య‌క్తి నిర‌స‌న
  • స్టేడియం పైక‌ప్పు దెబ్బ‌తిన్న వైనం
  • క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న అధికారులు
యూరోక‌ప్‌లో భాగంగా నిన్న‌ జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్ మ‌ధ్య జ‌రిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఊహించ‌ని ఘ‌ట‌న చోటు చేసుకుంది. యూరోక‌ప్ స్పాన్స‌ర్‌గా ఉన్న ర‌ష్యాకు చెందిన ఇంధ‌న ఉత్ప‌త్తి సంస్థ గాజ్‌ప్రోమ్‌కు వ్య‌తిరేకంగా ఓ వ్య‌క్తి వినూత్న రీతిలో నిర‌స‌న తెలపాల‌నుకున్నాడు. ప్యారాచూట్ సాయంతో ఎగురుతూ గాల్లోంచి స్టేడియంలోకి వ‌చ్చేశాడు. అయితే, ఓవ‌ర్‌హెడ్ కెమెరా వైర్ల‌కు అది త‌గలడంతో నియంత్ర‌ణ కోల్పోయింది.

దీంతో స్టేడియం పైక‌ప్పు దెబ్బ‌తిని దాని ముక్క‌లు స్టేడియంలోని అభిమానుల‌పై ప‌డడంతో కొంద‌రికి గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై యురోపియ‌న్ సాక‌ర్ మండిప‌డింది. ఆ నిర‌స‌న‌కారుడిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపింది. కాగా, ర‌ష్యాకు చెందిన గాజ్‌ప్రోమ్‌ సంస్థ ఆయిల్ ను వాడ‌కూడ‌దంటూ 'గ్రీన్ పీస్' కార్య‌క‌ర్త‌ స్టేడియం వ‌ద్ద‌ నినాదాలు చేశాడు. అత‌డు మైదానంలో దిగిన వెంట‌నే ఆట‌గాళ్లు ఆంటోనియో రైగ‌ర్‌, రాబిన్ గోసెన్స్ అత‌ని ద‌గ్గ‌రికి వెళ్లారు. అనంత‌రం భ‌ద్ర‌తా సిబ్బంది నిర‌స‌న కారుడిని అక్క‌డి నుంచి తీసుకెళ్లారు.


More Telugu News