అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయిన బీఎస్పీ బహిష్కృత ఎమ్మెల్యేలు
- గతేడాది బీఎస్పీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు
- ఎస్పీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానన్న సుష్మా పటేల్
- సస్పెన్షన్‌ను మాయావతి ఎత్తేస్తారన్న మరో ఎమ్మెల్యే
రాజ్యసభ ఎన్నికల సందర్భంగా గతేడాది అక్టోబరులో బీఎస్పీ నుంచి బహిష్కృతులైన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఐదుగురు నిన్న సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయ్యారు. దీంతో వారు ఆ పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దాదాపు 20 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యేల్లో ఒకరైన సుష్మా పటేల్ మాట్లాడుతూ.. యూపీ ఎన్నికల గురించి అఖిలేశ్‌తో చర్చించినట్టు తెలిపారు. తానైతే ఎస్పీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
మరో శాసనసభ్యుడు హకీంలాల్ బింద్ మాట్లాడుతూ.. అఖిలేశ్‌ను కలిసిన వారిలో తనతోపాటు చౌధరి అస్లాం అలీ, ముజ్తబా సిద్ధిఖి, హర్‌గోవింద్ భార్గవ్, మహమ్మద్ అస్లాం రైనీ, సుష్మా పటేల్ ఉన్నట్టు చెప్పారు. అయితే, అఖిలేశ్‌ను కలిసిన వారిలో తాను లేనని హర్‌గోవింద్ తెలిపారు.
మాజీ స్పీకర్ సుఖ్‌దేవ్ రాజ్భర్ తమతో వస్తే మొత్తం 12 మంది అవుతామని, దీంతో ప్రత్యేక వర్గంగా కొనసాగుతామని భింగా ఎమ్మెల్యే అస్లాం రైనీ తెలిపారు. మరో ఎమ్మెల్యే ముజ్తబా సిద్ధికీ మాట్లాడుతూ.. తమపై వేసిన సస్పెన్షన్‌ను మాయావతి ఎత్తివేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.