తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా నేడు విడుదల
- ఈ నెల 22, 23, 24వ తేదీలకు సంబంధించిన టికెట్లు
- రోజుకు 5 వేల చొప్పున టికెట్లు అందుబాటులో
- సన్నిధి యాదవుల హక్కులపై గెజిట్ విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తే. ఈ నెల 22, 23, 24వ తేదీలకు సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు. ఈ మూడు రోజుల్లో రోజుకు 5 వేల చొప్పున టికెట్లను విక్రయిస్తారు.
కాగా, తిరుమలలో పనిచేస్తున్న సన్నిధి యాదవులకు వంశపారంపర్య హక్కులు పునరుద్ధరిస్తూ చేసిన సవరణ చట్టం నిన్నటి నుంచే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతోపాటు దేవాలయాలను ఏబీసీ కేటగిరీలుగా విభజించేందుకు సంబంధించి ఆదాయ పరిమితులను మార్చేందుకు ప్రభుత్వానికి అధికారం కల్పించే సవరణ చట్టం కూడా నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినట్టు పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.