వైసీపీ ప్రభుత్వానివి ప్రజావ్యతిరేక విధానాలంటూ ధర్నాలకు పిలుపునిచ్చిన బీజేపీ
- బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు
- నూతన ఆస్తిపన్నుతో ప్రజలపై భారం పడుతుందన్న బీజేపీ
- ఉచితాలు ఇస్తూనే నడ్డి విరగ్గొడుతున్నారని ఆరోపణ
- కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ధర్నాలు
ఏపీ సర్కారుపై రాష్ట్ర బీజేపీ ధ్వజమెత్తింది. ఒక చేత్తో ఉచితాలను ఇస్తూ, మరో చేత్తో నూతన ఆస్తి పన్ను ప్రవేశపెట్టి ప్రజల నడ్డి విరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం (జూన్ 16) రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చినట్టు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టాలని పేర్కొన్నారు. కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఏపీ బీజేపీ స్పష్టం చేసింది.