తెలంగాణలో కొత్తగా 1,556 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 1,20,043 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 182 కేసుల నమోదు
- నిర్మల్ జిల్లాలో 3 కేసుల గుర్తింపు
- రాష్ట్రంలో 14 మంది మృతి
తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో 1,20,043 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,556 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 182 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 135, ఖమ్మం జిల్లాలో 133, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 114 కేసులు గుర్తించారు. నిర్మల్ జిల్లాలో అత్యల్పంగా 3 కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 2,070 మంది కరోనా నుంచి కోలుకోగా, 14 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,06,436 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,82,993 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,933 మందికి చికిత్స జరుగుతోంది. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,510కి చేరింది.