డబ్ల్యూటీసీ ఫైనల్ కు 15 మందితో జట్టును ప్రకటించిన బీసీసీఐ
- ఈ నెల 18 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్
- భారత్ వర్సెస్ న్యూజిలాండ్
- సౌతాంప్టన్ వేదికగా టైటిల్ సమరం
- విరాట్ కోహ్లీ కెప్టెన్ గా టీమిండియా ఎంపిక
ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ టైటిల్ కోసం ఈ నెల 18 నుంచి జరిగే ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ ఈ మ్యాచ్ కు వేదికగా నిలుస్తోంది. కాగా, ఈ మ్యాచ్ కోసం టీమిండియా మేనేజ్ మెంట్ 15 మందితో జట్టును ప్రకటించింది. కెప్టెన్ గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ గా అజింక్యా రహానే కొనసాగనున్నారు. జట్టులో రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లకు స్థానం కల్పించారు. అయితే, తుది జట్టులో రిషబ్ పంత్ ఉండే అవకాశాలే అత్యధికం.
జట్టు వివరాలు..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్.