సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

  • గతేడాది గాల్వన్ లోయలో ఘర్షణలు
  • చైనా బలగాలతో వీరోచితంగా పోరాడిన సంతోష్ బాబు
  • వీరమరణం పొందిన వైనం
  • స్వస్థలం సూర్యాపేటలో 9 అడుగుల కాంస్య విగ్రహం
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేటలో అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

సంతోష్ బాబు స్వస్థలం సూర్యాపేట. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కల్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విగ్రహం ఎత్తు 9 అడుగులు. కాగా, కల్నల్ సంతోష్ బాబు అమరుడైన అనంతరం, తెలంగాణ ప్రభుత్వం ఆయన కుటుంబానికి అండదండగా నిలిచింది. బంజారాహిల్స్ లో ఇంటిస్థలం, రూ.5 కోట్ల ఆర్థికసాయం, సంతోష్ బాబు భార్యకు గ్రూప్-1 హోదాతో ఉద్యోగం కల్పించారు.  

గత సంవత్సరం జూన్ 15న గాల్వన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కల్నల్ బి.సంతోష్ బాబు వీరమరణం పొందడం తెలిసిందే. ఆయన వయసు 37 ఏళ్లు.


More Telugu News