నాపై కక్ష గట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు: అశోక్ గజపతిరాజు
- అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు
- మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా పునర్నియామకంపై ఆదేశాలు
- నేడు పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న అశోక్
- నేతలకు జ్ఞానం ప్రసాదించాలని ప్రార్థించినట్టు వెల్లడి
మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా తన పునర్నియామకంపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వచ్చిన అనంతరం టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు నేడు విజయనగరంలో పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ రెండేళ్ల కాలంలో అరాచకాలకు పాల్పడ్డారని, తనపై కక్ష గట్టి దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలోని 105 ఆలయాల్లో ఎలాంటి కార్యకలాపాలు జరిగాయో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
మాన్సాస్ ట్రస్టును భ్రష్టు పట్టించారని, సింహాచలం గోశాలలో గోమాతలను హింసించి చంపారని ఆరోపించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు జ్ఞానం ప్రసాదించమని ఆ పైడితల్లి అమ్మవారిని ప్రార్థించినట్టు అశోక్ గజపతిరాజు వెల్లడించారు.