కన్నడ సినీ నటుడు సంచారి విజయ్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
- ప్రకటించిన కర్ణాటక సీఎం యడియూరప్ప
- అవయవ దానంపై కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు
- రోడ్డు ప్రమాదంలో విజయ్ కు బ్రెయిన్ డెడ్
- చనిపోయాడంటూ ఈ రోజు బులెటిన్ లో వెల్లడి
ప్రముఖ కన్నడ సినీ నటుడు సంచారి విజయ్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యడియూరప్ప ప్రకటించారు. పోలీసుల గౌరవ వందనంతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామన్నారు. విజయ్ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. విజయ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అతడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
కాగా, శుక్రవారం స్నేహితుడిని కలిసి బైకుపై ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో విజయ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వెంటనే అతడిని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అతడి బ్రెయిన్ డెడ్ అయిందని, స్పందనలు లేవని నిన్న అపోలో ఆసుపత్రి వైద్య సిబ్బంది బులెటిన్ విడుదల చేశారు.
తాజాగా ఈ రోజు తెల్లవారుజామున 3.34 గంటలకు విజయ్ మరణించినట్టు మరో బులెటిన్ లో వెల్లడించారు. దీంతో అతడి అవయవాలను దానం చేస్తామని విజయ్ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు.