విమానంలో సాంకేతిక లోపం.. ఈట‌ల రాజేంద‌ర్ బృందానికి త‌ప్పిన ప్ర‌మాదం

  • ఢిల్లీ నుంచి విమానం టేకాఫ్ స‌మ‌యంలో స‌మ‌స్య గుర్తింపు
  • పైల‌ట్ ముందుగానే గుర్తించడంతో త‌ప్పిన ప్ర‌మాదం
  • గంట ఆల‌స్యంగా వ‌స్తోన్న విమానం
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిన్న‌ ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న విష‌యం తెలిసిందే. ఈట‌ల రాజేంద‌ర్ త‌న‌తో వెళ్లిన వారంద‌రితో క‌లిసి ఈ రోజు ఉదయం హైద‌రాబాద్ కు తిరుగుప్రయాణం అయ్యారు. అయితే, వీరి విమానంలో సాంకేతిక సమస్య త‌లెత్తింది.

విమానం టేకాఫ్ కి ముందు సాంకేతిక సమస్యను గుర్తించిన వెంట‌నే పైలట్ అప్ర‌మ‌త్తం కావ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. ఆ త‌ర్వాత స‌మ‌స్య‌ను సిబ్బంది ప‌రిష్క‌రించారు. గంట ఆల‌స్యంగా విమానం ఢిల్లీ నుంచి బ‌య‌లుదేరింది.. దీంతో హైద‌రాబాద్‌కు ఈట‌ల రాజేంద‌ర్ బృందం ఆల‌స్యంగా వ‌స్తోంది. కాగా, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఈట‌ల చేరుకోగానే ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికేందుకు మ‌ద్ద‌తుదారులు  ఏర్పాట్లు చేసుకున్నారు.

నిన్న ఆయ‌న‌తో పాటు  ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన‌ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి , మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఆర్టీసీ నేత అశ్వత్థామ రెడ్డి బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే. వారితో పాటు ప‌లువురు నేత‌లు కూడా ఉన్నారు. వారంద‌రూ కాసేప‌ట్లో శంషాబాద్ చేరుకుంటారు.



More Telugu News