వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు 'టక్ జగదీశ్'
- శివ నిర్వాణతో రెండో సినిమా
- కరోనా కారణంగా వాయిదాపడిన విడుదల
- వచ్చేనెలలో థియేటర్లకు వెళ్లే ఆలోచన
- కీలకమైన పాత్రలో జగపతిబాబు
నాని కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' రూపొందింది. 'నిన్నుకోరి' వంటి హిట్ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమైన సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఏప్రిల్లోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా పాత్రల పరిచయ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఆ తరువాతనే కరోనా ఉద్ధృతి పెరుగుతూ రావడంతో, విడుదలను వాయిదా వేసుకున్నారు. థియేటర్లు కూడా మూతబడిపోయాయి.
ఇక ఇప్పుడు పరిస్థితి కాస్త ఆశాజనకంగా కనిపిస్తోంది. వచ్చేనెల నుంచి థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో తెరుచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. థియేటర్లు ఓపెన్ కాగానే 'టక్ జగదీష్'ను వదలాలనే ఆలోచనలో ఉన్నారట. అనుకోకుండా ఏదైనా సమస్య తలెత్తితే మాత్రమే ఆగస్టుకు వెళదామనీ, లేదంటే జులైలో విడుదలకు వెళదామనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఒక ముఖ్యమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.