జై శ్రీరాం అనాలంటూ దాడి చేశారంటున్న వృద్ధుడు.. కట్టుకథ అంటున్న పోలీసులు!
- ఈ నెల 5న ఘటన
- వృద్ధుడిని నిర్బంధించి దాడి
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- వృద్ధుడి ఆరోపణలు నిజం కాదన్న పోలీసులు
జై శ్రీరాం అని నినదించాలంటూ ఓ ముస్లిం వృద్ధుడిపై యువకులు దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ నెల 5న ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుండగా, ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధిత వృద్ధుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బులంద్‌షహర్‌కు చెందిన అబ్దుల్ సమద్ ఈ నెల 5న ఘజియాబాద్ నుంచి లోని పట్టణానికి వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు తనపై ముసుగు కప్పి అపహరించుకుని తీసుకెళ్లారని బాధిత వృద్ధుడు పేర్కొన్నాడు. ఆ తర్వాత ఓ ఇంట్లో నిర్బంధించి జై శ్రీరాం అనాలంటూ హింసించారని, పాకిస్థాన్ గూఢచారినంటూ గెడ్డం కత్తిరించారని వాపోయాడు. అతడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు.
అయితే, వృద్ధుడు చెబుతున్నదంతా అబద్ధమని, కట్టుకథ అని దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలు పోగొడతానంటూ నిందితులకు బాధితుడు తాయెత్తులు ఇచ్చాడని, వాటి వల్ల ప్రభావం లేకపోవడంతో అతడిని నిర్బంధించి దాడి చేసినట్టు తేలిందని వివరించారు.