ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో మంత్రి తలసానికి ఊరట
- పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తలసానిపై కేసు నమోదు
- కోడ్ ఉల్లంఘించి ప్రచారం చేశారంటూ ఆరోపణలు
- తలసాని, మరికొందరిపై పలు సెక్షన్లతో కేసు
- ఆధారాల్లేవంటూ కేసు కొట్టివేసిన కోర్టు
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నమోదైన కేసు నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఊరట కలిగింది. ఆయనపై మోపిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవంటూ నాంపల్లి 2వ సెషన్స్ కోర్టు కేసును కొట్టివేసింది.
నాడు ఈ కేసులో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ అభ్యర్థి, తలసాని తనయుడు కిరణ్ యాదవ్, ఎమ్మెల్సీలు రాజేశ్వర్ రావు, స్టీఫెన్ సన్, నాటి మోండా మార్కెట్ ప్రాంత కార్పొరేటర్ ఆకుల రూపపై పలు సెక్షన్లతో గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ ప్రచారం చేపట్టారని ఆరోపించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం... తలసాని కోడ్ అతిక్రమించారనడానికి సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. తలసాని తదితరులను నిర్దోషులుగా పేర్కొంది.