తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షల రద్దుపై జీవో జారీ

  • తెలంగాణలో ఇంటర్ పరీక్షల రద్దు
  • మార్కుల కేటాయింపు అధికారం ఇంటర్ బోర్డుకు
  • విధివిధానాలను ప్రభుత్వానికి సమర్పించనున్న బోర్డు
  • ప్రభుత్వ ఆమోదం వస్తే ఫలితాల వెల్లడి
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, పరీక్షల రద్దుపై నేడు జీవో జారీ చేశారు. అటు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను సెకండియర్ లోకి ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, ఫలితాలను ఏ ప్రాతిపదికన కేటాయించాలనే విషయంలో ఇంటర్ బోర్డుకు అధికారాలు మంజూరు చేశారు. దీనిపై కసరత్తులు చేసిన ఇంటర్ బోర్డు, రేపు ఇంటర్ ఫలితాల విధివిధానాలను ప్రభుత్వానికి పంపనుంది. ప్రభుత్వం ఆమోదం తెలిపాక రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను ప్రకటిస్తారు.


More Telugu News