కేసీఆర్‌పై వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర వ్యాఖ్యలు!
- వడ్లు వానకు తడిసి మొలకలొస్తున్నాయి
- రైతులు దండాలు పెట్టినా సర్కారు కొంటలేదు
- చావే దిక్కని రైతులు ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు
- కేసీఆర్ సారుకు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంటది
ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతో వడ్లు తడిసి మొలకలొచ్చాయని కలత చెందిన ఓ కౌలు రైతు ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఓ పత్రికలో వచ్చిన వార్తను వైఎస్ షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆసరి అంజయ్య అనే కౌలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అందులో పేర్కొన్నారు.
ఈ విషయాన్ని షర్మిల ప్రస్తావిస్తూ.. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతూ తడిసిపోతుండడంతో రైతులు నష్టపోతున్నప్పటికీ కేసీఆర్ పట్టించుకోవట్లేదని, సీఎం కేసీఆర్ కు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంటుందని షర్మిల పేర్కొన్నారు.
'వడ్లు వానకు తడిసి మొలకలొస్తున్నాయని, రైతులు దండాలు పెట్టినా.. రోడ్లు ఎక్కినా, సర్కారు కొంటలేదని.. చావే దిక్కని రైతు ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నా.. కేసీఆర్ సారుకు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంటది..' అని షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.