కరోనా వ్యాక్సిన్ల మేధోపరమైన హక్కుల నుంచి ఆయా దేశాలు మినహాయింపు ఇవ్వాలి: డబ్ల్యూహెచ్ఓ
- ఈ ఏడాది 30 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వాలన్న డబ్ల్యూహెచ్ఓ
- వచ్చే ఏడాదికి మొత్తమ్మీద 70 శాతం మందికి ఇవ్వాలని సూచన
- 1,100 కోట్ల డోసులు అవసరం అవుతాయని వెల్లడి
- కరోనా నిర్మూలనకు వ్యాక్సినేషనే మార్గమని స్పష్టీకరణ
ఈ ఏడాది చివరికల్లా ప్రపంచంలో 30 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ అందించాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ గేబ్రియేసస్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జర్మనీలో జరగబోయే జీ-7 దేశాల సమావేశం నాటికి ప్రపంచం మొత్తమ్మీద 70 శాతం మందికి వ్యాక్సిన్లు అందించాలని, కరోనా వైరస్ నిర్మూలనకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ఉద్ఘాటించారు.
70 శాతం మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలంటే 1,100 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరం అవుతాయని, వ్యాక్సిన్లను విరివిగా ఉత్పత్తి చేసేందుకే వీలుగా, వ్యాక్సిన్ల మేధోపరమైన హక్కులు కలిగిన ఉన్న దేశాలు తాత్కాలిక సడలింపులు కల్పించాలని గేబ్రియేసస్ పిలుపునిచ్చారు. జీ-7 దేశాల కూటమి సమావేశాలు నేటితో ముగియగా, ప్రపంచదేశాలకు కరోనా వ్యాక్సిన్ డోసులు అందిస్తామని జీ-7 దేశాధినేతలు హామీ ఇచ్చారు. దీనిపై స్పందిస్తూ గేబ్రియేసస్ తాజా వ్యాఖ్యలు చేశారు.