ఇప్పటి వరకు రాష్ట్రాలకు అందిన కరోనా టీకా డోసులు 26 కోట్లు!

  • వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ
  • 25.12 కోట్ల డోసుల వినియోగం
  • రాష్ట్రాల వద్ద ఇప్పటికీ 1.53 కోట్ల డోసులు
  • మరో 3 రోజుల్లో అందనున్న 4.5 లక్షల డోసులు
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటి వరకు 26 కోట్ల కరోనా టీకా డోసులు అందాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటిలో వ్యర్థాలతో కలుపుకొని 25.12 కోట్ల డోసుల్ని వినియోగించారని తెలిపింది. రాష్ట్రాల వద్ద ఇప్పటికీ 1.53 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రాలకు అందిన టీకాల్లో కొన్నింటిని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వగా.. మరికొన్నింటిని రాష్ట్రాలే నేరుగా తయారీ సంస్థల నుంచి సమకూర్చుకున్నాయని పేర్కొంది.

మరోవైపు దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు లక్ష దిగువన నమోదవుతున్నాయి. ఆదివారం కొత్తగా 80,834 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ఏప్రిల్‌ 2 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. అలాగే కొత్తగా 3,303 మరణాలు సంభవించాయి.


More Telugu News