ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయండి... గవర్నర్ బిశ్వభూషణ్ కు నారా లోకేశ్ లేఖ

  • గ్రూప్-1 మెయిన్స్ పై లోకేశ్ లేఖ
  • డిజిటల్ మూల్యాంకనంపై చర్యలు తీసుకోవాలని వినతి
  • సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్
  • నిరుద్యోగ యువతకు నమ్మకం కలిగించాలని విజ్ఞప్తి
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ గ్రూప్-1 పరీక్షల అంశంపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. గ్రూప్-1 అభ్యర్థులు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. డిజిటల్ మూల్యాంకనం అనేక విమర్శలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ పరిణామాలపై గవర్నర్ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయ విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని తన లేఖలో కోరారు. ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని ఆరోపించారు.

"ఏపీపీఎస్సీ సభ్యులను నియమించే అధికారం ఉన్న మీరు వెంటనే జోక్యం చేసుకుని, డిజిటల్ వేల్యుయేషన్ పై అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి" అని విజ్ఞప్తి చేశారు. ఏపీపీఎస్సీపై నిరుద్యోగ యువతకు తిరిగి నమ్మకం కలిగించేలా ప్రక్షాళన చేయాలని గవర్నర్ ను కోరారు.


More Telugu News