కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి: అమరావతి ఉద్యోగుల జేఏసీ

  • కాంట్రాక్టు ఉద్యోగుల అంశంపై జేఏసీ స్పందన
  • సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు వివరణ
  • సీపీఎస్ రద్దుకు లక్షల మంది వేచిచూస్తున్నట్టు వెల్లడి
  • 11వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్
రాష్ట్రంలో ఒప్పంద ప్రాతిపదికన నియమించిన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని అమరావతి ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఉద్యోగుల డిమాండ్లను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని అమరావతి ఉద్యోగుల జేఏసీ వెల్లడించింది. సీపీఎస్ రద్దుకు లక్షల మంది ఎదురుచూస్తున్నారని  పేర్కొంది. 11వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని జేఏసీ నేతలు కోరారు.

టెన్త్ పాసవ్వని మంత్రులు కూడా పదో తరగతి పరీక్షలపై మాట్లాడుతున్నారు: టీడీపీ

ఏపీలో పదో తరగతి పరీక్షల అంశం విపక్ష, అధికార పక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఏపీలో పదో తరగతి పరీక్షల గురించి టెన్త్ క్లాస్ పాస్ అవ్వని మంత్రులు కూడా మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఎద్దేవా చేశారు. దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఉందని నిపుణులు చెబుతుంటే, విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేకుండా ఏపీ సర్కారు పరీక్షలు జరిపేందుకు నిర్ణయించడం సరికాదని అన్నారు.

కరోనా ఎక్కువగా ఉందని లండన్ లో ఉన్న తన పిల్లలను సీఎం ఇంటికి తీసుకువచ్చినప్పుడు, ఇతర పిల్లలు అలాంటివారు కాదా? అని ప్రశ్నించారు. పరీక్షలపై వైసీపీ సర్కారు ఇప్పటికైనా మొండివైఖరి వీడాలని మంతెన స్పష్టం చేశారు.


More Telugu News