జమ్మూకశ్మీర్ లో శ్రీవారి ఆలయానికి భూమిపూజ

  • దేశంలో పలు చోట్ల శ్రీవారి ఆలయాలు
  • రూ.33 కోట్ల వ్యయంతో జమ్మూకశ్మీర్ లో ఆలయం
  • ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తిచేయాలని టీటీడీ సంకల్పం
  • పునాదిరాయి వేసిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
  • భూమిపూజకు కిషన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి హాజరు
దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నడుంబిగించింది. ఈ క్రమంలో నేడు జమ్మూకశ్మీర్ లో వెంకటేశ్వరస్వామి ఆలయానికి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుమల ఆలయ ఈవో జవహర్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శ్రీవారి ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు.

శ్రీవారి ఆలయం కోసం ప్రభుత్వం 62 ఎకరాల భూమిని 40 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. ఈ ఆలయాన్ని రూ.33 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా నిర్మించనున్నారు. అంతేకాదు, కేవలం ఏడాదిన్నరలోనే ఆలయ నిర్మాణం పూర్తిచేయాలని టీటీడీ సంకల్పించింది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించింది.


More Telugu News