మైదానంలో గాయమై విలవిల్లాడిపోయిన డుప్లెసిస్.. వీడియో ఇదిగో
- దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్
- పాకిస్థాన్ సూపర్‌లీగ్ టోర్నీలో ఆడుతోన్న ఆటగాడు
- బంతిని పట్టుకునే క్రమంలో తోటి ఆటగాడిని బలంగా తాకిన వైనం
- ఆసుపత్రికి తరలించిన సిబ్బంది
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ మైదానంలో గాయంతో విల్లవిల్లాడిపోయాడు. పాకిస్థాన్ సూపర్‌లీగ్ టోర్నీలో భాగంగా అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియంతో క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో బ్యాట్స్‌మన్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద డైవ్‌చేసి పట్టుకునే క్రమంలో మరో ఆటగాడు మహమ్మద్ హస్‌నెయిన్‌కు డుప్లెసిస్ తాకాడు.
దీంతో హసనెయిన్ మోకాలు డుప్లెసిస్ తలకి బలంగా తాకింది. దీంతో వెంటనే డుప్లెసిస్ కళ్లు తిరిగి పడిపోవడం గమనార్హం. ఆయనకు ఏం జరిగిందోనన్న ఆందోళన అక్కడున్న వారందరిలో కలిగింది. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో ఆయనకు స్కానింగ్ తీసిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పాక్‌లో కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో పీఎస్ఎల్ వాయిదా పడిన విషయం తెలిసిందే. జూన్ 9 నుంచి అబుదాబిలో తిరిగి ప్రారంభమైంది.