ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా బార్బొరా క్రెజికోవా

  • పావ్లిచెంకోవాపై 6-1, 2-6, 6-4 తేడాతో విజయం
  • క్రెజికోవాకు కెరీర్‌లో ఇది తొలి గ్రాండ్‌ స్లామ్‌
  • అంచనాల్లేకుండా బరిలోకి దిగి అబ్బురపరిచిన క్రెజికోవా
  • మరోవైపు 52వ గ్రాండ్‌స్లామ్‌ ఆడిన పావ్లిచెంకోవా
  • తొలిసారి ఫైనల్‌కు చేరిన రష్యా స్టార్‌
ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో చెక్‌ రిపబ్లిక్ కెరటం బార్బొరా క్రెజికోవా(25) విజేతగా నిలిచింది. టోర్నీ ఫైనల్‌లో రష్యా స్టార్‌ పావ్లిచెంకోవాపై 6-1, 2-6, 6-4 తేడాతో విజయం సాధించింది. క్రెజికోవాకు కెరీర్‌లో ఇది తొలి గ్రాండ్‌ స్లామ్‌ కావడం విశేషం.

ఏమాత్రం అంచనాలు లేకుండా టోర్నీలోకి అడుగుపెట్టిన 33వ ర్యాంకర్‌ క్రెజికోవా టైటిల్‌ను సొంతం చేసుకొని అందరినీ అబ్బురపరిచింది. ఈ టోర్నీకి ముందు ఏ గ్రాండ్‌స్లామ్‌లోనూ ఆమె 4వ రౌండ్‌ దాటిన దాఖలాలు లేవు. మరోవైపు 52వ గ్రాండ్‌స్లామ్‌లో ఆడిన రష్యా స్టార్‌ పావ్లిచెంకోవా ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. రెండో సెట్లో పుంజుకున్నప్పటికీ.. తుది విజయం సాధించడంలో మాత్రం వెనకడుగు వేసి టోర్నీని చేజార్చుకుంది.


More Telugu News