సాయం చేయాలని నాకు అర్ధరాత్రి కూడా కాల్స్ వస్తున్నాయి: చంద్రబాబుకి చెప్పిన సోనూసూద్
- వర్చువల్ పద్ధతితో చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సోను
- కరోనా వేళ దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నాకు కాల్స్
- నాకు వీలైనంత సాయం చేస్తున్నా
- హైదరాబాద్‌ని అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర గొప్పది
కరోనా వేళ తనకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సాయం కోసం ఫోన్ కాల్స్ వస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సినీనటుడు సోనూసూద్ చెప్పారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధులు, పలు రంగాల నిపుణులతో అధినేత చంద్రబాబు వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. ఇందులో పాల్గొన్న సోనూసూద్ మాట్లాడుతూ... తనకు అర్థరాత్రి సమయంలో కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. తనకు వీలైనంత సాయం చేస్తున్నానని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో సేవ చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు.
తన భార్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తే కావడం సంతోషమని సోనూసూద్ వ్యాఖ్యానించారు. తనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో ఆత్మీయ అనుబంధం ఉందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండో ఇల్లు వంటివని వ్యాఖ్యానించారు.
తాను హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడి పాత్రను ప్రత్యక్షంగా చూశానని సోనూసూద్ తెలిపారు. అప్పట్లో చంద్రబాబు హైదరాబాద్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని చెప్పారు. ఆ నగర అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర గొప్పదని చెప్పారు. కరోనాపై పోరాటంలో తామిద్దరి ఆలోచనలు కలవడం సంతోషమని వ్యాఖ్యానించారు.