వారందరికీ సెల్యూట్ చేస్తున్నా: చంద్రబాబు
- ఎన్నో విపత్తులు చూశాను
- కరోనా వంటి సంక్షోభం చూడడం ఇదే ప్రథమం
- సేవ చేయడం బాధ్యతగా భావించాలి
- సోనూసూద్ సేవలు ప్రశంసనీయం
కరోనా విజృంభణ నేపథ్యంలో పలు రంగాల నిపుణులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వర్చువల్ పద్ధతిలో సమావేశంలో మాట్లాడారు. ఇందులో సినీనటుడు సోనూసూద్ కూడా పాల్గొన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ ట్రస్టు సేవలు అందిస్తోందని చెప్పారు.
కరోనా వేళ సోనూసూద్ అనేక సేవలు చేశారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. అటువంటి వారు సమాజానికి అవసరమని చెప్పారు. ఎన్నో విపత్తులు చూశాను కరోనా వంటి సంక్షోభం చూడడం ఇదే ప్రథమమని ఆయన అన్నారు. సమాజం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సేవ చేయడం బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని తెలిపారు.
కరోనాపై పోరాటంలో కుటుంబ సభ్యులు కూడా రోగుల వద్దకు వెళ్లట్లేదని, ఇటువంటి సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్లు విలువైన సేవలు అందిస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. అధికారంలో వున్నా, లేకున్నా ప్రజాసేవలో ఉండడమే టీడీపీ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని చంద్రబాబు సలహా ఇచ్చారు.