బ్లాక్ ఫంగస్ కేసులను ఏపీ ప్రభుత్వం దాయడంలేదు: ఏకే సింఘాల్
- ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులపై సింఘాల్ వివరణ
- అనుమానాస్పద కేసులను ప్రకటించలేమని వెల్లడి
- నిర్ధారణ అయితేనే అధికారికంగా వెల్లడిస్తామని స్పష్టీకరణ
- ఇప్పటివరకు ఏపీలో 138 బ్లాక్ ఫంగస్ మరణాలు
ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వివరణ ఇచ్చారు. ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులను ప్రభుత్వం దాయడంలేదని స్పష్టం చేశారు. ఒకవేళ బ్లాక్ ఫంగస్ కేసులను తాము తగ్గించి చూపితే, కేంద్రం అందుకు అనుగుణంగానే తక్కువ సంఖ్యలో ఆంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లను పంపిస్తుందని వెల్లడించారు.
అనుమానాస్పద కేసులను ఎలా ప్రకటించగలమని అన్నారు. బ్లాక్ ఫంగస్ తో బాధపడుతున్నట్టు నిర్ధారణ చేసేంత వరకు అధికారికంగా ప్రకటించలేమని తెలిపారు. రాష్ట్రంలో 138 మంది బ్లాక్ ఫంగస్ కారణంగా మరణించారని వెల్లడించారు. ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని సింఘాల్ పేర్కొన్నారు. ఏపీలో ప్రస్తుతం 1,307 మంది బ్లాక్ ఫంగస్ తో బాధపడుతున్నారని తెలిపారు.