తెలంగాణలో 6 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

  • తాజాగా 1,707 పాజిటివ్ కేసులు
  • 6,00,318కి పెరిగిన మొత్తం కేసుల సంఖ్య
  • 5,74,103 మంది కొవిడ్ నుంచి కోలుకున్న వైనం
  • 95.63 శాతానికి పెరిగిన రికవరీ రేటు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 6 లక్షల మార్కు దాటింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,00,318 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 1,24,066 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,707 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 158 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 147, ఖమ్మం జిల్లాలో 124 కేసులు గుర్తించారు. అత్యల్పంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 5 కేసుల చొప్పున వెల్లడయ్యాయి.

అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 2,493 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మంది మృతి చెందారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో 5,74,103 మంది కొవిడ్ నుంచి కోలుకుని  ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,759 మందికి చికిత్స జరుగుతోంది. అటు, కరోనా రికవరీ రేటు 95.63 శాతానికి పెరిగింది.


More Telugu News