ఏపీలో కొత్తగా 8,239 కరోనా కేసులు

  • గత 24 గంటల్లో 1,01,863 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,396 కేసులు
  • చిత్తూరు జిల్లాలోనే 10 మంది మృతి
  • రాష్ట్రవ్యాప్తంగా 61 మంది కన్నుమూత
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతలో మునుపటి జోరు లేదు. గడచిన 24 గంటల్లో 1,01,863 కరోనా పరీక్షలు నిర్వహించగా 8,239 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,396 కొత్త కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 1,271 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 201 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 11,135 మంది కరోనా నుంచి కోలుకోగా, 61 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 10 మంది కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 11,824 మంది కొవిడ్ బారినపడి ప్రాణాలు విడిచారు. మొత్తం 17,96,122 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటిదాకా 16,88,198 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 96,100 మంది చికిత్స పొందుతున్నారు.


More Telugu News