వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి వర్ష సూచన

  • రాగల 24 గంటల్లో బలపడనున్న అల్పపీడనం
  • ఒడిశా మీదుగా కదలనున్న అల్పపీడనం
  • ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు
  • ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
  • దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు క్రియాశీలకంగా ఉన్న క్రమంలో, వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ విభాగం వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని  వెల్లడించింది. రాయలసీమలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.


More Telugu News