తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కీలక నేతల ఆందోళనలు
- పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నిరసనలు
- ఘట్కేసర్లో ఎంపీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిరసన
- హైదరాబాద్లో ఉత్తమ్ తో కలిసి కాంగ్రెస్ ఆందోళన
- జగిత్యాలలో జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణుల అరెస్ట్
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతోన్న నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెట్రోల్ బంకుల వద్ద నిరసనలు తెలుపుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు.
ఒకవైపు కరోనా ప్రజల జీవితాలతో ఆడుకుంటుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచేస్తూ మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందని చెప్పారు. ఘట్కేసర్లో ఎంపీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నిరసన తెలుపుతోంది. హైదరాబాద్-వరంగల్ రహదారి పక్కన ఉన్న పెట్రోలు బంకు వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.
హైదరాబాద్లో ఉత్తమ్ కుమార్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్, దాసోజు శ్రవణ్ నిరసనలో పాల్గొన్నారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలో ఆందోళనలు తెలుపుతున్నారు. జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.