వివేక హ‌త్య స‌మ‌యంలో అనుమానాస్ప‌ద వాహ‌నాల‌పై సీబీఐ ఆరా

  • కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచార‌ణ‌
  • ఏపీ ర‌వాణా శాఖ అధికారుల‌ను కూడా పిలిపించిన అధికారులు
  • విచార‌ణ‌కు వైసీపీ కార్య‌క‌ర్త‌ కిర‌ణ్ కుమార్ యాద‌వ్ హాజ‌రు
  • ఇద‌య‌తుల్లాను వ‌రుస‌గా ఐదోరోజు ప్ర‌శిస్తోన్న‌ అధికారులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) వ‌రుస‌గా ఐదో రోజు విచార‌ణ కొనసాగిస్తోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహానికి సీబీఐ అధికారులు  ఈ రోజు ఏపీ ర‌వాణా శాఖ అధికారుల‌ను కూడా పిలిపించి విచారించారు. వివేక హ‌త్య స‌మ‌యంలో అనుమానాస్ప‌ద వాహ‌నాల‌పై ఆరా తీశారు. ఆయా వాహ‌నాల వివ‌రాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు.

ఇప్ప‌టికే  వివేక హ‌త్య కేసులో అనుమానితుడిగా వైసీపీ కార్య‌క‌ర్త‌ కిర‌ణ్ కుమార్ యాద‌వ్ ను సీబీఐ అధికారులు ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. ఈ రోజు కూడా ఆయ‌న‌ను సీబీఐ అధికారులు విచారించారు. ఆయ‌న‌ను వ‌రుస‌గా మూడోరోజు ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

అలాగే,  గ‌తంలో వివేక ఇంట్లో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌గా ప‌నిచేసిన ఇద‌య‌తుల్లాను అధికారులు వ‌రుస‌గా ఐదో రోజు ప్ర‌శ్నిస్తున్నారు.  ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు అనుమానితులను విచారించిన విషయం తెలిసిందే.


More Telugu News