కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయిన ఏపీ ముఖ్యమంత్రి జగన్

  • రెండో రోజు కొన‌సాగుతోన్న ప‌ర్య‌ట‌న‌
  • ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ
  • విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంతో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌
  • పీయూష్‌ గోయల్‌తోనూ సమావేశమ‌య్యే చాన్స్
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఢిల్లీలో ప‌ర్య‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. నిన్న ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో స‌మావేశ‌మై ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు సంబంధించిన ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపిన జ‌గ‌న్ ఈ రోజు కూడా ప‌లువురిని క‌లిసి చ‌ర్చిస్తున్నారు.  

రెండోరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఉక్కు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఈ రోజు జ‌గ‌న్ భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంతో పాటు కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌, పెట్రో వర్సిటీ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. ఈ రోజు రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తోనూ ఆయ‌న‌ సమావేశం కానున్న‌ట్లు తెలుస్తోంది.

నిన్న జ‌గ‌న్ కేంద్రమంత్రులు అమిత్‌షా, గజేంద్రసింగ్‌ షెకావత్‌, ప్రకాశ్ జ‌వదేకర్ లను కలసి వివిధ అంశాలపై చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ వెంట  వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మిధున్‌రెడ్డి, అవినాశ్ రెడ్డి, బాలశౌరి తదితరులు ఉన్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనులు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయ‌న‌ చర్చించినట్లు తెలుస్తోంది. తిరిగి ఆయ‌న ఈ రోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని త‌న అధికారిక నివాసానికి చేరుకుంటారు.


More Telugu News