మలాలాపై దాడిచేయాలని పిలుపునిచ్చిన మతబోధకుడికి అరదండాలు

  • వివాహంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మలాలా
  • జీవితానికి తోడు కావాలంటే పెళ్లి ఎందుకని ప్రశ్న
  • మతబోధకుడిపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు
పాకిస్థాన్‌కు చెందిన హక్కుల కార్యకర్త, నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ (23)పై దాడిచేయాలని పిలుపునిచ్చిన మతబోధకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహానికి సంబంధించి మలాలా ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

‘‘మన జీవితానికి ఓ తోడు, భాగస్వామి కావాలంటే పెళ్లి పత్రాలపై సంతకాలు ఎందుకు చెయ్యాలి? భాగస్వాములుగా ఎందుకు ఉండలేరు’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఆమె వ్యాఖ్యలపై భగ్గుమన్న ఖైబర్ ఫక్తూంఖ్వా రాష్ట్రం మర్వాత్ జిల్లాకు చెందిన ముఫ్తీ సర్దార్ అలీ హక్కానీ.. మలాలాపై దాడి చేయాలని పిలుపునిచ్చారు. దీంతో స్పందించిన పోలీసులు ఆయనపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసులు నమోదు చేసి నిన్న అరెస్ట్ చేశారు.


More Telugu News