తెలంగాణలో కొత్తగా 1,798 కరోనా పాజిటివ్ కేసులు, 14 మరణాలు
- గత 24 గంటల్లో 1,30,430 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 174 మందికి పాజిటివ్
- అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 6 కేసులు
- 95.48 శాతానికి పెరిగిన రికవరీ రేటు
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,30,430 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,798 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. జీహెచ్ఎంసీ పరిధిలో 174, ఖమ్మం జిల్లాలో 165, నల్గొండ జిల్లాలో 151 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 6 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 2,524 మంది కరోనా నుంచి కోలుకోగా, 14 మంది మరణించారు.
తెలంగాణలో ఇప్పటిదాకా 5,98,611 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,71,610 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 23,561 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 3,440కి చేరింది. అటు, రాష్ట్రంలో కరోనా కేసుల రికవరీ రేటు మరింత పెరిగి 95.48 శాతానికి చేరింది.