అదంతా పుకారేనంటున్న పాయల్!

  • ఆశించిన స్థాయిలో లేని అవకాశాలు
  • 'బిగ్ బాస్ 5' చేయనుందని వార్తలు  
  • పుకార్లలోకి తనని లాగొద్దని మనవి 
తెలుగు తెరకి ఈ మధ్యకాలంలో పరిచయమైన గ్లామరస్ హీరోయిన్స్ లో పాయల్ ఒకరు. పాయల్ మంచి పొడగరి కావడంతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో ఎలాంటి మొహమాటాలు లేకుండా చేస్తుంది. అంతే కాదు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ గా ఆమె పోస్ట్ చేసే స్టిల్స్ కోసం కుర్రాళ్లంతా ఎంతో ఆసక్తిగా .. ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు.

ఈ నేపథ్యంలోనే తెలుగు 'బిగ్ బాస్ .. సీజన్ 5' కోసం పాయల్ ను తీసుకున్నారనే ఒక టాక్ వినిపిస్తోంది. ఈ సీజన్ లో చేయడానికి పాయల్ ఓకే చెప్పేసిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ విషయంపై పాయల్ స్పందిస్తూ .. "ఇదంతా పుకారు మాత్రమేననీ .. తాను 'బిగ్ బాస్ 5'లో చేయడం లేదని చెప్పింది. ఇలాంటి పుకార్లలోకి అనవసరంగా తనని లాగొద్దని అంది. నిజానికి కొంతకాలంగా పాయల్ సరైన హిట్ కోసం వెయిట్ చేస్తోంది. అలాంటి హిట్ ఆమెకి త్వరలో పడాలనే అభిమానులు కూడా ఆశిస్తున్నారు.


More Telugu News