కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని అమలు చేయాలి: కేటీఆర్
- కరోనా వేళ కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాల్సి ఉంది
- సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలి
- కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ తెలంగాణలో ప్రగతి
- ఐటీ, పారిశ్రామిక రంగాల్లో
కరోనా వేళ కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాల్సి ఉందని, రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని అమలు చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కేంద్ర సర్కారు ఆదుకోవాల్సి ఉందని చెప్పారు. ఎంసీహెచ్ఆర్‌డీలో పరిశ్రమలు, ఐటీ శాఖల వార్షిక నివేదికను విడుదల చేసిన కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడారు.
కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తాము ప్రగతి సాధించామని చెప్పుకొచ్చారు. పారదర్శకత కోసమే వార్షిక నివేదిక విడుదల చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విధివిధానాలు, సమష్టి కృషి వల్లే అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతున్నామని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో 3.23 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని, ఏడేళ్ల తర్వాత ఆ సంఖ్య రెట్టింపు అయిందని చెప్పారు. మొత్తం 20 లక్షలకు మందికి పైగా ఐటీ రంగంపై ఆధారపడి పని చేస్తున్నట్లు వివరించారు.