మహిళలకు మరింత స్వేచ్ఛ.. కీలక నిర్ణయం తీసుకున్న సౌదీ అరేబియా
- మహిళలు ఇకపై ఒంటరిగా ఉండొచ్చు
- పురుషుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు
- ఇష్టం వచ్చిన చోట జీవించే హక్కును కల్పించిన సౌదీ
మహిళలపై సామాజిక కట్టుబాట్లు అధికంగా ఉండే సౌదీ అరేబియాలో అక్కడి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లికాని అమ్మాయిలు, విడాకులు తీసుకున్న, భర్త చనిపోయిన మహిళలకు స్వేచ్ఛను కల్పించింది. ఇకపై వారు తండ్రి లేదా ఇతర పురుష సంరక్షకుడి అనుమతి లేకుండానే వేరుగా ఒంటరిగా జీవించవచ్చు.
అంటే ఇకపై ఒంటరి మహిళలు పురుషుల తోడు లేకుండానే ఉండొచ్చు. దేశంలో మహిళలకు ఈ స్వేచ్ఛను కల్పిస్తూ సౌదీ ఇటీవల ఒక చట్టపరమైన సవరణను తీసుకొచ్చింది. ఈ మేరకు న్యాయ అధికారులు ఆర్టికల్ నంబరు 169లోని లా ప్రొసీజర్ బిఫోర్ షరియా కోర్టు పేరా-బీను కొట్టేశారు.
దీంతో పెళ్లికాని, విడాకులు తీసుకున్న, భర్తను కోల్పోయిన మహిళలు పురుషుల సంరక్షణలోనే ఉండాలన్న నిబంధన రద్దయింది. మహిళలు ఇకపై తమకు ఇష్టం వచ్చిన చోట జీవించే హక్కును కలిగి ఉంటారు. ఒంటరిగా ఉండాలని నిర్ణయం తీసుకున్న మహిళలకు వ్యతిరేకంగా ఇకపై వారి కుటుంబ సభ్యులు న్యాయస్థానంలో దావా వేయడానికి వీల్లేదు.