600 మంది సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ‘కళామతల్లి చేదోడు’
- నిర్మాతలు దిల్‌రాజు, చదలవాడ, రవిచంద్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ
- ‘కళామతల్లి చేదోడు’ పేరుతో కార్యక్రమం
- ఒక్కొక్కరికి రూ. 2500 విలువైన సరుకుల పంపిణీ
కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న కార్మికులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు కొందరు ముందుకొచ్చారు. నిర్మాతలు దిల్‌రాజు, చదలవాడ శ్రీనివాసరావు, యలమంచిలి రవిచంద్ కలిసి ‘కళామతల్లి చేదోడు’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నేడు 600 మంది సినీ కార్మికులకు రూ. 2500 విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. కష్టాల్లో ఉన్న కార్మికులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన దిల్‌రాజు, చదలవాడ శ్రీనివాసరావు, యలమంచిలి రవిచంద్‌లను పలువురు ప్రముఖులు అభినందించారు.