నెట్ ఫ్లిక్స్ వైపు వెళ్లిన తరుణ్ భాస్కర్?

  • దర్శకుడిగా మంచి పేరు
  • నటుడిగాను గుర్తింపు
  • లైన్లో రెండు కథలు  
వైవిధ్యభరితమైన కథలను తయారుచేసుకుంటూ ..  తనదైన స్టైల్లో ఆవిష్కరిస్తూ  తరుణ్ భాస్కర్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. 'పెళ్లి చూపులు' .. 'ఈ నగరానికి ఏమైంది?'  వంటి సినిమాలు ఆయన ప్రతిభకు అద్దం పడతాయి. తక్కువ బడ్జెట్ లో చాలా సింపుల్ గా సినిమాలు చేయడం ఆయన ప్రత్యేకత. ఈ మధ్య కాలంలో ఆయన నటుడిగాను బిజీ అయ్యాడు.

ఇక, తాను రాసిన రెండు కథలను సురేశ్ ప్రొడక్షన్స్ వారు ఓకే చేశారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తరుణ్ చెప్పాడు. త్వరలో అవి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా ఆయన తెలిపాడు. అయితే ఆయన నెట్ ఫ్లిక్స్ వైపు అడుగులు వేసినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో తెలుగు కంటెంట్ క్రియేటివ్ కన్సల్టెంట్ గా ఆయన వర్క్ చేస్తున్నాడని అంటున్నారు. ఒక వైపున దర్శకుడిగా.. మరో వైపు నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్, హఠాత్తుగా ఇలా రూట్ మార్చుకోవడమనేది అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ విషయంలో వాస్తవమెంతన్నది తెలియాల్సి ఉంది.


More Telugu News