న‌ష్ట‌పోయిన బాధిత వ‌ర్గానికి వెంట‌నే న్యాయం చేయాలి: ఏపీ సీఎస్ కు చంద్ర‌బాబు లేఖ

  • విశాఖ‌లోని మాన‌సిక విక‌లాంగుల పాఠ‌శాల నిర్మాణాల తొలగింపు స‌రికాదు
  • ఇటువంటి చ‌ర్య‌లకు పాల్ప‌డ‌డం దారుణం
  • ఆ పాఠ‌శాల‌ను లాభాపేక్ష లేకుండా నిర్వ‌హిస్తున్నారు
  • ల్యాండ్ మాఫియాతో చేతులు క‌లిపిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ కి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు లేఖ రాశారు. విశాఖ‌లోని మాన‌సిక విక‌లాంగుల పాఠ‌శాల నిర్మాణాల తొలగింపుపై ఆయన అందులో అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. ఇటువంటి చ‌ర్య‌లకు పాల్ప‌డ‌డం దారుణ‌మ‌ని ఆయ‌న విమర్శించారు.

విభిన్న ప్ర‌తిభావంతుల కోసం ఆ పాఠ‌శాల‌ను లాభాపేక్ష లేకుండా నిర్వ‌హిస్తున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. దాని ద్వారా పేద కుటుంబాల‌కు చెందిన 190 మంది సేవ‌లు పొందుతున్నార‌ని గుర్తు చేశారు. న‌ష్ట‌పోయిన బాధిత వ‌ర్గానికి వెంట‌నే న్యాయం చేయాల‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌ల‌కు లాభాపేక్ష లేకుండా సేవ‌లు అందిస్తోన్న సంస్థ నిర్మాణాల‌ను సీజ్ చేయ‌డం స‌రికాద‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. ల్యాండ్ మాఫియాతో చేతులు క‌లిపిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.


More Telugu News