అక్రమార్కులపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి?: దేవినేని ఉమ
- మార్కెట్లో యథేచ్ఛగా నకిలీ పత్తి విత్తనాలు
- ప్యాకెట్లలో వివిధ పేర్లతో జోరుగా లూజు విత్తనాల విక్రయాలు
- ఏటా నష్టపోతున్న రైతులు
- దళారులతో కుమ్మక్కై అధికారులు లబ్ధి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. యథేచ్ఛగా నకిలీ(ల)లు పేరుతో ఓ దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు. ఖరీఫ్ సీజన్ సాగు ప్రారంభం కావడంతో నకిలీ పత్తి విత్తనాల విక్రయాలు యథేచ్ఛగా కొసాగుతున్నాయని ఆ కథనంలో పేర్కొన్నారు.
కర్నూలు కేంద్రంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా ఈ నకిలీ విత్తనాల సరఫరా జరుగుతోందని చెప్పారు. అక్రమార్కులతో వ్యవసాయ శాఖలోని కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని, నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని ఆ కథనంలో పేర్కొన్న విషయాలను దేవినేని ఉమ ప్రస్తావించారు.
'మార్కెట్లో యథేచ్ఛగా నకిలీ పత్తి విత్తనాలు. ప్యాకెట్లలో వివిధ పేర్లతో జోరుగా లూజు విత్తనాల విక్రయాలు. ఏటా నష్టపోతున్న రైతులు. నామమాత్రపు దాడులతో సరి. దళారులతో కుమ్మక్కై లబ్ది. ధరలు లేక ఇబ్బందులు పడుతుంటే నకిలీలతో మరింత నష్టం. అక్రమార్కులపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి? వైఎస్ జగన్' అని దేవినేని ఉమ నిలదీశారు.