కరోనా నుంచి కోలుకున్న వారిలో హెర్పిస్ ఇన్ఫెక్షన్!
- కొవిడ్ నుంచి కోలుకున్న వారు, క్వారంటైన్‌లో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు
- హెచ్ఎస్‌వీ వల్ల హెర్పిస్ లేబియాలిస్ ఇన్ఫెక్షన్
- హెర్పిస్ జోస్టర్ బారిన పడుతున్న కొవిడ్ బాధితులు
ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత ఇక బయటపడిపోయామన్న ధీమా లేకుండా చేస్తోందీ మహమ్మారి. దీని నుంచి కోలుకున్న తర్వాత కూడా వివిధ రూపాల్లో వేధిస్తోంది. కరోనా బారి నుంచి కోలుకున్న తర్వాత వేధిస్తున్న పలు సమస్యలలో ఇప్పుడు హెర్పిస్ ఇన్ఫెక్షన్ కూడా చేరింది.
వైరస్ నుంచి కోలుకున్నాక ఇది తిరగబెడుతోంది. ఫలితంగా జట్టు రాలిపోవడం, శరీరంపై దద్దుర్లు, పొక్కులు, పెదవి చుట్టూ పొక్కులు వంటివి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినవారు, క్వారంటైన్‌లో ఉన్నవారు ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్ బాధితుల్లో ఎక్కువమంది హెర్పిస్ ఇన్ఫెక్షన్‌కు గురవుతున్నారని పేర్కొన్నారు.
హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ (హెచ్ఎస్‌వీ) వల్ల హెర్పిస్ లేబియాలిస్ ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ఇది క్రమంగా హెచ్ఎస్‌వీ-1 లేదంటే హెచ్ఎస్‌వీ-2కు దారితీసే అవకాశం ఉంది. అదే జరిగితే పెదవి చుట్టూ నీటిపొక్కులు రావడంతోపాటు నొప్పి కూడా ఉంటుంది. కొవిడ్ బాధితుల్లో హెచ్ఎస్‌వీ కంటే హెర్పిస్ జోస్టర్ కేసులే ఎక్కువగా వస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత వారిసెల్లా-జోస్టర్ వైరస్ మళ్లీ యాక్టివేట్ అయి హెర్పిస్ జోస్టర్ అనే ఇన్ఫెక్షన్‌ను కలిగిస్తుంది. ఫలితంగా చర్మంపై చెల్ది పొక్కులు వస్తాయని చెబుతున్నారు. అలాగే, క్యాండిడా ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల మర్మాయవవాల వద్ద తెల్లటి పొక్కులు వస్తుంటాయి. గోళ్లపై గోధుమ రంగులో గీతలు రావడం, మహిళల్లో జుట్టు రాలిపోవడం, నుదురు, వీపుపై మచ్చలు రావడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిలో ఏదైనా లక్షణం కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు.