దేశవ్యాప్తంగా 28,252 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు: కేంద్రం

  • 86 శాతం కేసులు కరోనా బాధితుల్లోనే
  • 62.3 శాతం మందికి డయాబెటిస్‌
  • 6,339 కేసులతో తొలిస్థానంలో మహారాష్ట్ర
  • క్రమంగా తగ్గుతున్న కరోనా ప్రభావం
  • 6.34 శాతానికి చేరుకున్న పాజిటివిటీ రేటు
దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 28,252 మ్యూకర్‌మైకోసిస్‌(బ్లాక్‌ ఫంగస్‌) కేసులు వెలుగు చూశాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. వీటిలో 86 శాతం కేసులు కొవిడ్‌ సోకిన వారిలోనే ఉన్నాయని తెలిపారు. అలాగే 62.3 శాతం మందికి డయాబెటిస్‌ ఉందని పేర్కొన్నారు.

మహారాష్ట్ర 6,339 బ్లాక్‌ ఫంగస్‌ కేసులతో జాబితాలో తొలి స్థానంలో ఉండగా.. 5,486 కేసులతో గుజరాత్‌ రెండో స్థానంలో ఉంది. మరోవైపు కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని నీతి ఆయోగ్‌ సభ్యుడు(ఆరోగ్యం) వి.కె.పాల్ తెలిపారు. పాజిటివిటీ రేటు 6.34 శాతానికి పడిపోయిందన్నారు. వరుసగా 14 రోజులుగా పాజిటివిటీ రేటు 10 శాతం లోపే నమోదవుతోందన్నారు. అయితే, 15 రాష్ట్రాల్లో ఇప్పటికీ పాజిటివిటీ రేటు 10 శాతం పైన ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు.


More Telugu News