టాలీవుడ్ సినీ కార్మికులకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించాం: చిరంజీవి
- అపోలో సహకారంతో వ్యాక్సిన్లు
- సీసీసీ, చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కార్యక్రమం
- ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి
- 'మా' సభ్యులు, సినీ జర్నలిస్టులకు కూడా వ్యాక్సిన్లు
గతేడాది కరోనా సమయంలో టాలీవుడ్ సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి చొరవతో కార్యరూపం దాల్చిన సీసీసీ సినీ కార్మికులను అనేక విధాలుగా ఆదుకుంది. తాజాగా, సీసీసీ, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు కరోనా వ్యాక్సిన్లు అందిస్తున్నారు. దీని ప్రారంభ కార్యక్రమంలో చిరంజీవి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అపోలో 24/7 వైద్య సంస్థ సహకారంతో ఈ వ్యాక్సినేషన్ నేడు ప్రారంభమైందని తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 విభాగాల కార్మికులు, 'మా' సభ్యులు, సినీ జర్నలిస్టులందరికీ టీకాలు అందిస్తామని చిరంజీవి వివరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా చిరంజీవి ట్విట్టర్ లో పంచుకున్నారు.