ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం.. ఎరుపు, నీలి రంగు ప్యాకెట్లలో ఔషధం
- ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మందు
- ఆనందయ్య మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవన్న కాకాని
- కొవిడ్ సోకిన వారికి ఎరుపు రంగు ప్యాకెట్ మందు
- కరోనా రాని వారికి నీలి రంగు ప్యాకెట్ లో మందు
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య తయారు చేస్తోన్న కరోనా మందు పంపిణీ ఈ రోజు ప్రారంభమైంది. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్నారు. ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆనందయ్య మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవని తెలిపారు.
ఇప్పటికే కొవిడ్ వచ్చిన వారు ఎరుపు రంగు ప్యాకెట్ లోని మందు వాడాలని, కరోనా రాని వారు నీలం రంగు ప్యాకెట్ లోని మందు వాడాలని గోవర్ధన్‌రెడ్డి వివరించారు. సర్వేపల్లిలో మందు పంపిణీతోనే ఆనందయ్య మందు ఆగిపోదని, త్వరలోనే ఇతర జిల్లాలకూ పంపిణీ చేస్తామని తెలిపారు.
రోజుకి రెండు వేల నుంచి మూడు వేలమందికి ఆనందయ్య మందును పంపిణీ చేస్తామని చెప్పారు. అల్లోపతి మందులు వాడుతూనే ఆనందయ్య మందు తీసుకోవాలని తెలిపారు.