ప్రభుత్వం నుంచి సహకారం అందితే ఇతర ప్రాంతాల వారికీ మందును ఇస్తాం: ఆనందయ్య
- తయారీకి అవసరమైన సామగ్రి లేదని ఆవేదన
- యంత్రాలు, విద్యుత్ సౌకర్యం లేదని కామెంట్
- ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందట్లేదు
కరోనా ఔషధ పంపిణీలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని, అందుకే సవ్యంగా సాగట్లేదని కృష్ణపట్నం ఆనందయ్య తెలిపారు. మందు తయారీకి అవసరమయ్యే మూలికలు, సామగ్రి సరిగ్గా సమకూరడం లేదని వాపోయారు. మందును తయారు చేసేందుకు యంత్ర సామగ్రిగానీ, విద్యుత్ సదుపాయాలూ లేవన్నారు.
మందు తయారీకి ఏపీ ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందట్లేదని ఆయన ఆరోపించారు. అనుమతులైతే ఇచ్చిందిగానీ సాయం మాత్రం చేయలేదన్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఔషధ పంపిణీ కొనసాగుతోందన్నారు. ఇతర ప్రాంతాల వారు రావొద్దన్నారు. ప్రభుత్వం నుంచి సహకారం అందితే ఇతర ప్రాంతాల వారికీ మందును ఇస్తామని చెప్పారు.