పండంటి ఆడబిడ్దకు జన్మనిచ్చిన హ్యారీ, మేఘన్!
- రాచరిక హోదా వదులుకున్న హ్యారీ, మేఘన్
- ప్రస్తుతం అమెరికాలో నివాసం
- కొత్త శిశువుకు లిలిబెత్ లిల్లీ డయానాగా నామకరణం
- ఈ దంపతులకు ఇప్పటికే ఆర్చీ అనే అబ్బాయి
బ్రిటన్ రాచరిక హోదాను స్వచ్ఛందంగా వదులుకున్న డ్యూక్ అండ్ డచ్చెస్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హారీ, మేఘన్ దంపతులు పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. జూన్ 4న కాలిఫోర్నియాలోని శాంటా బర్బరా కాటేజ్ ఆసుపత్రిలో మేఘన్ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
కొత్త శిశువుకు ‘లిలిబెత్ లిల్లీ డయానా మౌంట్‌బ్యాటెన్-విండ్సర్‌గా నామకరణం చేశారు. ప్రస్తుతం బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ గౌరవార్థం లిలిబెత్, హ్యారీ తల్లి డయానా గౌరవార్థం ‘డయానా’ను కొత్త శిశువు పేరులో చేర్చారు. ఎలిజబెత్ రాణిని రాజ కుటుంబీకులు ముద్దుగా లిలిబెత్ అని పిలుచుకుంటుంటారు.
హ్యారీ-మేఘన్ దంపతులకు ఇప్పటికే ఆర్చీ అనే అబ్బాయి ఉన్నాడు. అతను 2019లో జన్మించారు. రాజకుటుంబంలో యూకే వెలుపల పుట్టిన తొలి వ్యక్తి లిల్లీయే కావడం విశేషం. రాజ కుటుంబంతో తెగతెంపులు చేసుకున్న తర్వాత వీరివురు అమెరికాలో నివాసముంటున్న విషయం తెలిసిందే.