చిరు పుట్టినరోజే పట్టాలెక్కనున్న లూసిఫర్ రీమేక్?
- కరోనాతో ఆగిపోయిన ఆచార్య షూటింగ్
- ఆచార్య పూర్తికాగానే లూసిఫర్ ప్రారంభం
- తమిళ దర్శకుడు మోహన రాజా దర్శకత్వం
- ఎన్వీ ప్రసాద్ నిర్మాత
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని తెరపై ఆడాల్సింది. కానీ, కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఆగిపోయింది. దీంతో ఆయన తదుపరి చిత్రం లూసిఫర్ రీమేక్‌ను సైతం వాయిదా వేయాల్సి వచ్చింది. కరోనా ఆంక్షల నుంచి చిత్రీకరణకు త్వరలో మినహాయింపులు లభించనున్న నేపథ్యంలో వెంటనే ఆచార్య షూటింగ్ పూర్తి చేయాలని డైరెక్టర్ కొరటాల శివ భావిస్తున్నారట.
ఆ తర్వాత చిరు పుట్టినరోజైన ఆగస్టు 22న లూసిఫర్ రీమేక్ షూటింగ్‌ను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. అన్నీ సాఫీగా సాగితే ఆగస్టు 22న లూసిఫర్ రీమేక్ టీజర్ విడుదల కావాల్సింది. కానీ, కరోనా ప్రభావం వల్ల ఆరోజున షూటింగ్ ప్రారంభించాల్సి వస్తోంది. తమిళ దర్శకుడు మోహనరాజా లూసిఫర్ రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. ఎన్వీ ప్రసాద్ దీనికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. చరణ్ ఈ సినిమాకు సహ నిర్మాతగా ఉండనున్నట్లు సమాచారం.
మళయాళం లూసిఫర్‌లో కథానాయకుడిగా నటించిన మోహన్‌లాల్ పాత్ర చిరంజీవిని అమితంగా ఆకట్టుకుందట. దీంతో ఆ పాత్ర పోషించాలన్న ఉద్దేశంతో చిరంజీవి ఈ సినిమా రీమేక్‌కు సిద్ధమయ్యారు. అయితే, మళయాళ స్క్రిప్ట్‌కు, తెలుగు స్క్రిప్ట్‌కు చాలా తేడా ఉండనుందని సమాచారం. ఇప్పటికే మార్పులు పూర్తి చేసిన చిత్ర బృందం.. పూర్తి కమర్షియల్ హంగులు అద్దినట్లు తెలుస్తోంది.